తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఎంతో కాలం అవుతుంది. ఇప్పటికి హీరోగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక నాగార్జున ప్రస్తుతం హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈమధ్య నాగార్జున నటించిన ఏ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోతోంది అభిమానులను. అయితే చివరిగా మాత్రం నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించి కాస్త పర్వాలేదు అనిపించుకున్నారు. అయితే ప్రస్తుతం నాగార్జున మాత్రం ది ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా సోనాల్ చౌహాన్ నటిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ,టీజర్ ప్రేక్షకులలో, అభిమానులలో సైతం బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంటుంది. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ విడుదలవుతోంది. అదేమిటంటే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

సినిమా కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 25వ తేదీన కర్నూలలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది అందుకు సంబంధించి ఒక పిట్టు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నారని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతోనైనా నాగార్జున సక్సెస్ అందుకుంటారేమో చూడాలి మరి. ఇక అంతే కాకుండా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు అదే రోజున చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, మంచు విష్ణు నటిస్తున్న జిన్నా, అలాగే బెల్లంకొండ సాయి నటిస్తున్న మరొక సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ చిత్రాలలో ఏ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: