సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్.. సర్వసాధారణం.. ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అంటే వామ్మో క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందా ఆ హీరోయిన్ కి..
పాపం,, అంటూ జాలీగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం క్యాస్టింగ్ కౌచ్ అంటే .."ఆ ఏముంది అందరి హీరోయిన్స్ తో పాటు ఈ హీరోయిన్ కి అయింది" అన్నట్లు మాట్లాడుతున్నారు జనాలు. అంతలా క్యాస్టింగ్ కోచ్ అన్న పదాన్ని కూడా దిగజార్చేసారు సినీ ఇండస్ట్రీలో ఉండే కొంతమంది పెద్దలు.

అయితే సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ కి బలైన హీరోయిన్లలో చాందిని చౌదరి కూడా ఒకరు. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలర్ ఫోటో అనే సినిమా ద్వారా పాపులర్ అయిన చాందిని చౌదరి అంతకుముందు పలు విధాలుగా పాపులర్ అవ్వాలని చూసినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ "కలర్ ఫోటో" సినిమా ద్వారా అమ్మడు నటనకు అందానికి ఎక్స్ప్రెషన్స్ కి ఎమోషన్స్ కి జనాలు ఫిదా అయిపోయారు. ఈ సినిమా ద్వారానే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది చాందిని చౌదరి.

అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవడంతో మళ్లీ ఎక్కడ మొదలుపెట్టిందో అక్కడికే వచ్చి ఆగింది. కాగా గతంలో కొన్ని చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాందిని చౌదరి మాట్లాడుతూ తనకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందని.. ఓ ప్రముఖ బడా డైరెక్టర్ తనను కమిట్మెంట్ అడిగారని చెప్పుకొచ్చి మీడియా ముందు ఎమోషనల్ అయ్యింది.

అంతేకాదు చాందినీ చౌదరిని ఆ డైరెక్టర్ తాకరాని చోట తాకుతూ కమిట్మెంట్ అడుగుతూ బిహేవ్ చేశారని ..దీంతో ఆమె నో చెప్పడంతో బిగ్ సినిమా నుంచి ఆమెను తీసేసారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి . అంతేకాదు చాందిని చౌదరి రీసెంట్గా కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టాలని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి టాలీవుడ్ ఆదరించలేని చాందిని చౌదరిని కోలీవుడ్ అయినా ఆదరిస్తుందో లేదో..?

మరింత సమాచారం తెలుసుకోండి: