ఆస్కార్ 2023 అవార్డుల కు ఆర్ఆర్ఆర్ ను ఎంపిక చేయకపోవడం పై డైరెక్టర్ ఎన్. శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గుజరాతీ చలో షోను ఏ కోణం లో నామినేట్ చేశారో అర్థం కావడం లేదన్నారు.
ఈ సంద్భరం గా ఆయన మీడియా తో మాట్లాడు తూ.. “ఛల్లో షో లాంటి చిత్రాలు దక్షిణాది లో చాలా వచ్చాయి. ఈ ను ఏ కోణం లో నామినేట్ చేశారో తెలియడం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జ్యూరీ కి పంపకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ట్రిపుల్ ఆర్‏లో దేశభక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలున్నాయి. భారతీయ ప్రతిష్టను కాపాడటానికి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఎంతో కృషి చేసింది. స్టేట్ అవార్డు కు నేషనల్ అవార్డుకు ఆస్కార్ అవార్డు కు తేడా తెలియని కమిటీల సెలక్షన్ ఇలాగే ఉంటుంది. సెలక్షన్ కమిటీల పై అనేక ఒత్తిళ్లు ఉంటాయి కానీ కమిటీ విచక్షణ తో పని చేయాలి ” అని అన్నారు.

ఇండియన్ ఆస్కార్ నామినేట్ కమిటీ కి జ్యూరీ సభ్యుని గా, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ కీ వైస్ చైర్మన్ గా.. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ కమిటీ కి జ్యూరీ మెంబర్ గా పని చేశారు. ఆరుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో జ్యూరీ మెంబర్ గా.. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్స్ కమిటీ చైర్మెన్ గా పని చేసిన అనుభవం తో ఆర్ఆర్ఆర్ ను జ్యూరీ కి ఎంపిక చేయకపోవడం తో ఆశ్చర్యపోయాను. ఈ లో దేశ భక్తిbతో పాటు.. గొప్ప నిర్మాణ విలువలు ఉన్నాయని అన్నారు. అయితే ఇండియన్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ కు బదులు గా గుజరాతీ మూవీ చలో షోను ఆస్కార్ 2023 అవార్డుల కు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: