తెలుగు సినిమా హీరోల మధ్య ఐక్యమత్యం ఉండదని.. హీరోలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తారు అంటూ కొందరు భావిస్తూ ఉంటారు. కానీ తెలుగు హీరోల మధ్య ఉన్నంత ఐక్యమత్యం మరే భాష హీరో ల మధ్య ఉండదు అంటూ జాతీయ స్థాయి మీడియా వ్యక్తులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందుకు తాజాగా తమిళనాడు లో జరుగుతున్న ఒక అతి పెద్ద బాక్సాఫీస్ వార్‌ ని ఉదాహరణగా చూపిస్తున్నారు. తమిళంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా పొన్నియన్‌ సెల్వన్ ఈనెల 30 తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తమిళ బాహుబలి అంటూ సినిమా ను అక్కడ మీడియా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసింది. అంత భారీ సినిమా కు.. ఇండస్ట్రీ గర్వించ దగ్గ సినిమా కు మరే సినిమా లు కూడా పోటికి రాకూడదు. గతం లో బాహుబలి సినిమా విడుదల సమయం లో ఇతర సినిమాలన్నీ కూడా తప్పుకున్న విషయం తెలిసిందే.

తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా కి కూడా పోటీ లేకుండానే వచ్చింది. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్‌ మాత్రం పోటీతోనే రాబోతుంది. ధనుష్ హీరో గా నేనే వస్తున్నా సినిమా ఒక్క రోజు తేడా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కచ్చితం గా ధనుష్ సినిమాసినిమా కి నష్టం చేకూర్చుతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఐక్య మత్యం లేని కారణం గానే ధనుష్ సినిమాసినిమా తో పోటీ పడాల్సి వచ్చిందంటూ కొందరు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాదిరిగా అక్కడ పెద్దల మాట వినేందుకు హీరో లు ఆసక్తి చూపించరు.. అలాగే నిర్మాతల పట్టు అక్కడ అసలే లేదు. అందుకే విడుదల విషయం లో హీరో లు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయం లో మన టాలీవుడ్ హీరో లు చాలా బెస్ట్ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: