టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున సరసన అందాల ముద్దు గుమ్మ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా , టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరు అయిన ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను మరియు కొన్ని వీడియో లను ,  ఒక పాటను కూడా విడుదల చేసింది. వీటన్నిటికీ కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే రేపు అనగా సెప్టెంబర్ 22 వ తేదీన ఈ మూవీ నుండి ఒక యాక్షన్ వీడియోను కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొద్ది సేపట క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ది ఘోస్ట్ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ను విడుదల చేసింది. ది ఘోస్ట్ మూవీ యూనిట్ ఏ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 25 వ తేదీన సాయంత్రం 6 గంటలకు 'ఎస్ టి బి సి' కాలేజ్ గ్రౌండ్స్ కర్నూల్ లో నిర్వహించ నున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో నాగార్జున చేతిలో గన్ పట్టుకొని స్టైలిష్ లుక్ లో నిలబడి ఉన్నాడు. తాజాగా ది ఘోస్ట్ మూవీ యూనిటీ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్ మూవీ పై అక్కినేని అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: