కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన అజిత్ ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే అజిత్ ఇప్పటికే తాను నటించిన కొన్ని మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఎలా ఉంటే ఆఖరుగా అజిత్ 'వలిమై' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించారు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ ,  మలయాళ ,  హిందీ భాషల్లో విడుదల అయ్యింది. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అజిత్ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ ని మరియు ఈ మూవీ లోని అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. అజిత్ కెరియర్ లో  61 వ మూవీ గా తెరకెక్కుతున్న సినిమాకు మూవీ యూనిట్ 'తునివు' అనే టైటిల్ ను కన్ఫామ్ చేసింది. 

ఈ టైటిల్ తో కూడిన అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ కి కూడా హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వరకే హెచ్ వినోద్ ,  అజిత్ కాంబినేషన్ లో  నెరుకొండ పారువై, వలిమై మూవీలు తెరకెక్కాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం 'తునివు' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: