జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తేరకెక్కబోయే మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయికి మించి తెరకెక్కించే ఆలోచనలో చిత్ర బృందం ఉండడంతో ఈ మూవీ స్క్రిప్ట్ కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దాదాపు 9 భాషలలో విడుదల చేసే ఆలోచనలో  చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం.

అలాగే ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా కొరటాల శివ ఉండడంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మూవీ కోసం  స్లిమ్ లుక్ లో లో కనబడడం కోసం బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ మూవీ కి రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా పని చేయనున్నాడు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై భారీ అంచనాలు సినీ ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ని మాత్రం చిత్ర బృందం ఇప్పటివరకు ఫైనల్ చేయలేదు. మొదట ఈ మూవీ లో ఎన్టీఆర్ తరఫున ఆలియా భట్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కియార అద్వానీ , రష్మిక మందన ,  సాయి పల్లవి ఇలా ఎంతో మంది తీర్లలో తెరపైకి వచ్చాయి. కానీ ఎవరి పేరును కూడా మూవీ యూనిట్ ఫైనల్ చేయలేదు. మరి ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన ఏ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తుందో తెలియాలి అంటే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: