మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా సీతారామం సినిమా ద్వారా తెలుగు లో కూడా ఎంతో మంచి ఆదరణ పొందారు.ఇలా సీతారామం సినిమా ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తెలుగు లో మరిన్ని సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నట్లు తెలుస్తుంది


సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజా గా బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.


గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో నే బాయ్ కాట్ ట్రెండ్ పై దుల్కర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే బాయ్ కాట్ కల్చర్ కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే ఉందని సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి కల్చర్ ఎక్కడా కనిపించలేద ని ఈయన తెలిపారు. సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారంటూ ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.


 


ఇలా బాయ్ కాట్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల పలు సినిమాలు కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోతున్నాయంటూ ఈయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం గురించి బాలీవుడ్ హీరోలు మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడితే ఎక్కడ వారి సినిమాలను టార్గెట్ చేస్తారేమోనని ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ భాయ్ కాట్ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే తాను చేసిన సీతా రామం సినిమా తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: