హీరో నాని పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించి అందరికి దగ్గరయ్యాడు. అష్టాచమ్మా తో హీరోగా అరంగేట్రం చేసిన నాని.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించాడు..ఇటీవలే శ్యామ్ సింగరాయ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. అంటే సుందరానికీ మూవీతో ప్రేక్షకులను నవ్వించాడు. తన సహజనటన తో తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో దసరా చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శ్రీకాంద్ ఓదెలు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.


అయితే ఇండస్ట్రీ లో స్టార్‏గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా నాని తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఈ సందర్భంగా నాని కొన్ని విషయాలను షేర్ చేశారు.మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాను. 2005లో రాధాగోపాలం కు దర్శకుడు బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నాను. కొన్ని రోజులు రేడియో జాకీగా పనిచేశాను. ఆ తర్వాత కొన్ని ప్రకటనల్లో నటించే అవకాశాలు వచ్చాయి.


2008లో విడుదలైన అష్టా చెమ్మా నాకు పేరు తీసుకువచ్చింది. అయితే ఇదంతా ఒక్కరాత్రిలో వచ్చింది కాదు. ఎంతో కష్టపడ్డాను. నేను చేసే ప్రతి పనిలో నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంత మంది అభిమానుల ప్రేమ, అప్యాయతలు నాకు దక్కుతున్నాయంటే నిజంగా నేను అదృష్టవంతుడిని ' అంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా విన్న వాళ్ళు నాని నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.. అంత కష్ట పడ్డాడు కాబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారని కొందరు ప్రముఖులు అభినందిస్తున్నారు.. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: