తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు త్రివిక్రమ్ తో మరో సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టింది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటం తో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ఇప్పటికీ టీవీల్లో ప్రేక్షకులను అలరిస్తుండటం తో, వీరిద్దరు మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారని మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..


ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. ఈ సీక్వెన్స్‌ లో మహేష్ అల్ట్రా యాక్షన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ సినిమా లో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటం తో ఈ సినిమాలో ఆయన పూర్తి లుక్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ ను చిత్ర యూనిట్ తాజాగా ముగించుకుంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు..


ఇది ఇలా వుండగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను దసరా తరువాత ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో షెడ్యూల్‌ లో మహేష్ బాబుతో పాటు అందాల భామ పూజా హెగ్డే కూడా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ పై రాధాకృష్ణసినిమా ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.. ఈ సినిమా కు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. మొత్తాని కి ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఫ్యాన్స్ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి: