నాగార్జున ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 40 సంవత్సరాలు దాటిపోతోంది. ఎందరో ప్రముఖ దర్శకులతో నటించి వెండితెర మన్మదుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్నాడు. ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేసిన నాగార్జునకు మాత్రం ఇప్పటివరకు 100 కోట్ల హీరోగా మారాలి అన్న కోరిక తీరలేదు. ఇలాంటి పరిస్థితులలో నాగార్జున అడిగిన ఒక కోరికవిని రాజమౌళి ఒక చిరునవ్వు నవ్వాడట.


ఈవిషయాన్ని స్వయంగా నాగార్జున ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తనకు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాను చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని దీనితో తనకు రాజమౌళి ఎదురైనప్పుడల్లా తాను అడిగినప్పటికీ జక్కన్న మాత్రం తనకు సమాధానం ఇవ్వకుండా చిరునవ్వు చిందిస్తూ తనకి సమాధానం ఇచ్చే వాడని ఇప్పటికీ తనకు రాజమౌళి చిరునవ్వులోని అర్థాలు ఏమిటో తెలియలేదు అంటూ జక్కన్న తెలివితేటాల పై షాకింగ్ కామెంట్స్ చేసాడు.


అంతేకాదు రాజమౌళి తన కథను నమ్ముకుంటాడని అందువల్ల తనకు సరిపోయే కథ దొరికేవరకు రాజమౌళి ఇలా తన ప్రశ్నకు ఇలా నవ్వుతూనే ఉంటాడని తనకు అర్థం అయింది అని అంటున్నాడు. అంతేకాదు అలాంటి రోజు ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని ఆశతో ఉన్నట్లు నాగార్జున ఆశాభావం వ్యక్తపరిచాడు. కొంతకాలం క్రితం బాలకృష్ణ కూడ రాజమౌళి తో తన ‘అన్ ష్టాపబుల్’ షోలో ఇంటర్వ్యూ చేస్తూ తనతో సినిమా ఎప్పుడు తీస్తావు అంటూ బాలయ్య తన సహజ ధోరణిలో ప్రశ్నిస్తే రాజమౌళి కూడ ఈవిధంగానే ఒక చిరునవ్వు నవ్విన విషయం తెలిసిందే.


దీనితో రాజమౌళి సీనియర్ హీరోలతో సినిమాలు తీయడా అన్న ఉద్దేశ్యం కలగడం సహజం. అమితాబ్ లాంటి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరో కూడ తనకు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉంది అంటూ ఆమధ్య ఓపెన్ గా చెప్పిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఆరాటపడే టాప్ హీరోల సంఖ్య పెరిగిపోతుంటే జక్కన్న మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండ తనకు నచ్చిన హీరోతోనే సినిమా చేస్తాడు అన్నవిషయం అందరికీ తెలిసిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: