ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోవడంతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాల డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్ దర్శకులలో డిఫరెంట్ సినిమాలు తీస్తాడు అని పేరుగాంచిన ఆర్.బాల్కి ఇప్పుడు లేటెస్ట్ గా తీసిన మూవీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈమూవీ గురించి బాలీవుడ్ మీడియా కూడ ఆసక్తికర కామెంట్స్ చేసింది.


షాకింగ్ న్యూస్ ఏమిటంటే కొత్త సినిమాల‌ను రివ్యూ చేసి స్టార్ల‌తో రేటింగ్స్ ఇచ్చే క్రిటిక్స్‌ను వెతికివెతికి హ‌త్య‌లు చేసే సీరియ‌ల్ కిల్ల‌ర్ స్టోరీ ఇది అని అంటున్నారు. మంచి సినిమాల‌కు త‌క్కువ రేటింగ్స్ చెడ్డ సినిమాల‌కు ఎక్కువ రేటింగ్స్ ఇచ్చే వారిని ఆ కిల్లర్ చంపుతూ ఉంటాడట. అంతేకాదు ఆ హత్యలు చేసాక అలా చంపినవారికి రేటింగ్స్ కూడ ఇస్తాడట.


స‌న్నీ డియోల్ దుల్క‌ర్ స‌ల్మాన్ లు ఈ మూవీలో ముఖ్యమైన పాత్ర‌లో నటిస్తున్నారు. ఈ మూవీ పేరు  ‘చుప్’ ఈ వారం ఈసినిమా విడుదల కాబోతోంది. ఈమూవీ ప్రమోషన్ ను కూడ చాల డిఫరెంట్ గా చేస్తున్నారు. ఈసినిమా విడుదల సందర్భంగా ముంబాయ్ లో ప్రివ్యూ షోలు వేసారు. అంతేకాదు దేశంలోని అనేక ప్రధాన నగరాలలో ఈమూవీ ప్రివ్యూ షోలను వేసి ప్రేక్షకులకు ఉచితంగా విడుదల ముందే చూపించి ఆసినిమా పై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.


దీనితో ఇలాంటి వెరైటీ పబ్లిసిటీతో విడుదల కాబోతున్న ఈమూవీ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారింది. అయితే ఈసినిమా విడుదల అయిన తరువాత విమర్శకులు ధైర్యం చేసి రేటింగ్స్ ఇస్తారా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. విమర్శకులు సరైన అవగాహన లేకుండా ఇస్తున్న రేటింగ్స్ వల్ల మంచి సినిమాలు నష్టపోతున్నాయి అన్న కామెంట్స్ వస్తున్న పరిస్థితులలో సెటైరికల్ గా తీసిన ఈమూవీ ఏమేరకు ప్రేక్షులను ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే ప్రస్తుత తరం ప్రేక్షకుల అభిరుచి అంచనా వేయడం కష్టం కాబట్టి ఈసినిమా విడుదల అయి రిజల్ట్ వచ్చే వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది..మరింత సమాచారం తెలుసుకోండి: