ఏలాంటి పాత్రలోనైనా సరే నటిస్తు ప్రేక్షకులను సైతం మైమరిపిస్తూ ఉంటుంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. ఇక దర్శకులు చెప్పినట్లు నడుచుకోవడంలో ముందు ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుచేతనే ఈమెకు ఫ్లాప్ లు వచ్చిన సరే దర్శకులు సైతం మేము ఒక అవకాశం ఇస్తూ ఉంటారు. అయితే రకుల్ ప్రీతిసింగ్ అలా అవకాశాలు సంపాదించుకోవడం వెనుక పలు కష్టాలు ఉన్నట్లుగా కూడా ఆమె ఒకానొక సందర్భంలో తెలియజేసింది. ముఖ్యంగా రకుల్ ఎక్కువగా జిమ్ వర్కౌట్లు యోగ వంటివి చేస్తూ ఉంటుంది.


రకుల్ ప్రీతిసింగ్ సీనియర్ నటి అయినప్పటికీ పరోక్షంగా దర్శకుడు చెప్పకుండానే తనను తానుగా ఫిట్ గా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ హిందీలో డాక్టర్ జి సినిమాతో పాటు మరొక సినిమాలో కూడా నటిస్తున్నది డాక్టర్ జీలో మెడికల్ స్టూడెంట్ పాత్రలో ఇమే కనిపించబోతున్నది. తాజాగా ఆ పాత్రకు సంబంధించి తను ఎలా ట్రైనింగ్ అయ్యిందో అనే విషయాన్ని తెలియజేసింది. రకుల్ ఇందులో గైనకాలజిస్ట్ పాత్ర కోసం ఆమె ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని ముందుగానే కలిసి అందుకు సంబంధించిన పలు విషయాలను కూడా తెలుసుకుందట.మెడికల్ క్యాంపులో కామెడీ గా తన పాత్రమెప్పించేలా ఉంటుందని తెలియజేస్తోంది. ఇక అంతే కాకుండా వైద్య విద్యార్థుల నుంచి వైద్య పరికరాలను ఎలా వినియోగించుకోవాలి.అనే విషయాన్ని డాక్టర్లను అడిగి మరీ తెలుసుకున్నాను అని తెలియజేస్తోంది. అవసరమైన చోట డాక్టర్ల ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఆమె అడిగి తెలుసుకున్నట్లుగా. థాంక్ గాడ్ చిత్రంలో కూడా ఈమె ఒక పోలీస్ పాత్ర కోసం బాగానే శ్రమించినట్లు తెలియజేసింది. ఒక ప్రొఫెషనల్ పోలీస్ అధికారి ఎలా ఉండాలి అందుకు సంబంధించిన యూనిఫామ్ ఎలా ఉండాలి ఉమెన్ పోలీస్ అనగానే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కొంతమంది పోలీసులు అడిగి స్వయంగా తెలుసుకున్నామని తెలియజేసింది. అయితే తన వద్ద కథ ఓకే చెప్పగానే ఇలాంటివి డైరెక్టర్ చెప్పకుండానే తెలుసుకున్నానని తెలియజేస్తోంది రకుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: