యువ హీరోలలో విభిన్నమైన కథలను ఎంచుకుంటు దూసుకుపోతున్నారు హీరో విశ్వక్ సెన్.. ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగాz మిథాలీ పాల్కర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఓరి దేవుడా.. ఈ సినిమాని pvc శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పతాకం పై సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు.ఈ సినిమాని అశ్వత్ మరుమత్తు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. తమిళంలో ఓ మై కడవులే అనే సినిమా అక్కడ భారీ విజయం అందుకోవడం ఈ సినిమాని తెలుగులో రీమిక్స్ చేస్తూ ఉన్నారు. తమిళంలో దర్శకత్వం వహించిన మరి ముత్తు ఈ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని తాజగా ఆడియన్స్ ఊహించని విధంగా అప్డేట్ ఇచ్చి అందరిని ఆచార్యపరిచారు.


ఈ సినిమాలో కీలకమైన పాత్ర లో హీరో వెంకటేష్ కూడా నటిస్తున్నారు.ఈ విషయాన్ని తాజాగా తెలుపుతూ ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ వీడియోను విడుదల చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమాని అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమా ఎటువంటి హడావిడి లేకుండా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పవచ్చు. దీంతో సినీ ప్రేక్షకులు సైతం ఆశ్చర్య పోవడం జరిగింది. ఇక అక్టోబర్ నెలలో పెద్దగా ఏ సినిమాలు విడుదల  అవ్వడం తక్కువగా ఉండడం చేత ఈ సినిమాని అక్టోబర్ నెల లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.


ఈ చిత్రం లో హీరో వెంకటేష్ దేవుడు పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లో  ఒక కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తూ ఉన్నారు. వెంకటేష్ కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతూ ఉన్నారు. మరి ఈ చిత్రం  ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి.. గ్లింప్స్ వైరల్ గా మారుతున్నది. విశ్వక్ సెన్ సక్సెస్ అందుకుంటారేమో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: