ఇటీవల రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర సినిమా మొదటి భాగం భారీ ఓపెనింగ్స్ తో విడుదలైనప్పటికీ ఈ సినిమాకి నెగటివ్ టాక్ రావడం జరిగింది. అయితే బాలీవుడ్ లో మాత్రమే సినిమా ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. దాదాపుగా రూ. 200 కోట్ల రూపాయలు బాలీవుడ్ లో వసూలు చేసి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. కానీ ఓపెనింగ్ పరంగా తిరుగులేని చిత్రంగా నిలిచింది ఈ సినిమా. దీంతో బ్రహ్మాస్త్ర-2 సినిమాకి కాస్త ఊపిరి పోసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ అప్పుడే రెండవ భాగానికి సంబంధించి సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే ఈ సినిమాలో అగ్ర హీరో రణబీర్ కూడా నటించారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో రణబీర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం డైరెక్టర్ అయాన్ తో సహా తను షారుఖ్ ఖాన్ ను ఎంపిక చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలియజేశారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ మోహన్ భార్గవ్ అని ఒక సైంటిస్ట్ పాత్రలో కూడా కనిపించబోతున్నారని తెలిపారు. అయితే ఈ పాత్ర మొదటి భాగంలో చంపబడుతుంది మరి ఇప్పుడు అదే రోల్ ని రెండవ భాగంలో షారుక్ ఖాన్ లీడ్ చేయబోతున్నారని తెలిపారు.


ప్రస్తుతం డైరెక్టర్ ఆయాన్ ఆపాత్ర అని ఎలా మలచాలి అని ఒక సీరియస్ కోణంలో వర్క్ చేస్తున్నట్లుగా తన  మాటల్ని బట్టి మనకు అర్థమవుతొంది. దీన్నిబట్టి చూస్తే బ్రహ్మాస్త్ర-2 సినిమా బరువు బాధ్యతలను మొత్తం షారుఖ్ ఖాన్ మోయబోతున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా మొదటి భాగాన్ని రూ. 400 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. మొదటి భాగంలో వచ్చిన నష్టాల్ని రెండవ భాగంలో పూర్తిచేసే విధంగా టార్గెట్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ సినిమా రెండవ భాగం సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి. మరి షారుఖ్ ఖాన్ పై చిత్రగుండం అధికారికంగా త్వరలోనే క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: