కృష్ణంరాజు మరణంతో మానసిక ఒత్తిడిలో ఉన్న ప్రభాస్ పై తాను పూర్తి చేయవలసిన సినిమాల ఒత్తిడి చాల ఎక్కువగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమధ్యనే ప్రభాస్ తన మానసిక ఒత్తిడిని పక్కకుపెట్టి ఒకరోజు షూటింగ్ కు వచ్చినప్పటికీ అతడు చాల మూడీగా కనిపించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ కోసం వేసిన 12 సెట్స్ అతడి గురించి వేచి చూస్తున్నట్లు టాక్. ఈ సెట్స్ అన్నీ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ కోసం వేసివని అంటున్నారు. ఈ సెట్స్ లో ప్రభాస్ నటించవలసిన సన్నివేశాల చిత్రీకరణకు సుమారు 10 రోజులు పడుతుందని ఒకసారి ప్రభాస్ తిరిగి ట్రాక్ లోకి పడితే షూటింగ్ స్పీడ్ అందుకుంటుందని ‘సలార్’ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే ప్రస్తుతానికి ప్రభాస్ ఏ డేట్ నుండి షూటింగ్ లకు వస్తాడు అన్న విషయమై క్లారిటీ లేకపోయినప్పటికీ ప్రభాస్ కోసం ‘ఆదిపురుష్’ టీమ్ కూడ ఎదురు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈసినిమాకు సంబంధించిన కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ పెండింగ్ లో ఉన్నాయి అంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాకు సంబంధించి ఒక కీలక షెడ్యూల్ నవంబర్ లో తీయవలసి ఉంది అని తెలుస్తోంది.


ఇప్పుడు ప్రభాస్ పెండింగ్ వర్క్ పెరిగిపోతూ ఉండటంతో ఈమూవీకి సంబంధించిన నవంబర్ షెడ్యూల్ ఎంతవరకు ఉంటుంది అన్న సందేహాలు కూడ వస్తున్నాయి. గత కొంతకాలంగా దర్శకుడు మారుతి ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈమూవీ ప్రారంభం జరిగినప్పటికీ ఇన్ని ఒత్తిడిల మధ్య ప్రభాస్ ఎప్పటి నుంచి ఈసినిమాకు డేట్స్ ఇస్తాడు అన్న కన్ఫ్యూజన్ స్వయంగా మారుతికి ఉంది అని అంటున్నారు. ఇన్ని ఒత్తిడిల మధ్య ప్రభాస్ ఈసినిమాలు అన్నీ వరసగా పూర్తి చేయకపోతే ప్రభాస్ సినిమాల షెడ్యూల్ లో చాల మార్పులు వచ్చి అది అతడి అభిమానులకు నిరాశను కల్గించే ఆస్కారం ఉంది..మరింత సమాచారం తెలుసుకోండి: