తమిళంలో సూపర్ స్టార్ గా పేరుపొందిన అజిత్ కుమార్ ప్రస్తుతం డైరెక్టర్ వినోద్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్నారు. ఇక వీరి ముగ్గురు కాంబినేషన్లో రూపొందుతున్నది ఇది మూడవ చిత్రం. కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో విడుదలైన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. అయితే తాజాగా అజిత్ కుమార్ కు సంబంధించి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టరు విడుదల చేయడం జరిగింది.


ఈ సినిమాకి తునివు అనే టైటిల్ను ఖరారు చేసినట్లుగా కూడా తెలుస్తోంది.. ఈ టైటిల్ అర్థం దృఢత్వం అనే  విధంగా టైటిల్ ని పెట్టినట్లుగా సమాచారం. ఈ సినిమాలోని అజిత్ లుక్కుని కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక లుక్కును చూసినవారు చాలా స్టైలిష్ గా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ పోస్టర్ చూసిన వారంతా వావ్ అని కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే అజిత్ లుక్  విషయంలో మరికొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఈ పోస్టర్ని చూసి ఓల్డ్ లుక్ అని ట్రోల్ చేస్తూ ఉన్నారు.తెల్ల జుట్టు మరియు తెల్ల గడ్డం చాలా ఏజ్ బార్ హీరోగా కనిపిస్తున్నారని కొంతమంది. ఆంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో పలు రకాలుగా విమర్శలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంపై ఎవరు అంతగా స్పందించలేదు. ఇక అజిత్ నటించిన వాలిమై చిత్రం లో చాలా యంగ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు అయితే మళ్ళీ ఇప్పుడు ఎలా తెల్ల వెంట్రుకలతో చాలా ఓల్డ్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ కొందరు నిరాశతో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా ఈ పోస్టర్తో మరింత హైప్ పెంచిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: