నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తమిళనాడు లో వెరైటీ చిత్రాలు చేసే దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్న ఈ దర్శకుడు తెలుగులో తొలిసారి సినిమా చేయడం విశేషం. ఆయన తమిళంలో చేసిన చాలా సినిమాలు తెలుగులో విడుదలయ్యి మంచి సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఆ విధంగా ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఏర్పరచుకున్న ఈ దర్శకుడు తెలుగులో సినిమా చేస్తే చూడాలని చాలామంది అభిప్రాయపడ్డారు.

ఆయన రెగ్యులర్ సినిమాల తరహాలోని కథలు తమిళనాడు అగ్ర హీరోల అందరితో సినిమాల్లో చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు తెలుగు లో కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టడం ప్రేక్షకులను ఆనంద పెట్టిస్తుంది. ఆ విధంగా అక్కినేని నాగచైతన్యతో ఆయన సినిమాను మొదలు పెట్టక తాజాగా ఈ సిని మాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. వెంకట్ గత సినిమాల లాగానే ఈ సినిమా ఎంతో వెరైటీగా ఉండబోతుంది అని ఈ పోస్టర్ ను బట్టి చెప్పవచ్చు. మరి ఈ పోస్టర్ ని బట్టి ఈ సినిమా జోనర్ ఇంతవరకు తెలుగులో రాలేదని చెప్పాలి. 

ఇంతవరకు ఎవరు చేయని జోనర్ లో సినిమా చేయడం నిజంగా నాగచైతన్యకే చెల్లింది. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తిగా వివరాలు వెల్లడించనున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది అని చెప్పవచ్చు. నాగ చైతన్య కొత్త సినిమా థాంక్యూ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించని నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా తప్పకుండా భారీ విజయం అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. మరి ఈ సరికొత్త జోనర్ లో చేయబోతున్న ఈ సినిమా ఏ విధంగా అక్కినేని అభిమానులను అలరిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ శేరావేగంగా జరుపుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: