టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా  , రమ్య కృష్ణమూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. మైక్ టైసన్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ,  డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ ఈ మూవీ ఆగస్టు 25 వ తేదీన తెలుగు ,  తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది.  భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయిన ఈ మూవీ ఈ రోజు నుండి 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి ఎంటర్ ఇచ్చింది. లైగర్ మూవీ ప్రముఖ 'ఓ టి టి'  సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: