మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదలవుతుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఈనెల 25వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేస్తుంది. అలాగే 28వ తేదీన అనంతపూర్ లో ఈ సినిమాకు సంబంధించిన చేయడానికి సర్వం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నాడని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఇంకొక వైపు బాలీవుడ్ సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమా యొక్క వేడుకకు హాజరు కాబోతున్నాడట అభిమానులు. ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ స్థాయిలో క్రేజ్ ఏర్పరచుకోవడం విశేషం. అయితే ఇంకొక వైపు ఈ సినిమాకు ఏ మాత్రం బజ్ లేదనే వార్తలు వినిపిస్తూ ఉండడం మెగా అభిమానులను ఎంతగానో కలవర పెట్టిస్తుంది. వాస్తవానికి ఈ సినిమాకు ఇప్పటిదాకా పాజిటివ్ వైబ్స్ అనేది క్రియేట్ అవలేదు కారణం ఏదైనా కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి సినిమాకు ఈ విధమైన వార్తలు బయటకు రావడం నిజంగా ఎంతో బాధపడవలసిన విషయం అని చెప్పాలి.

ఎంత బ్యాడ్ లక్ లేకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర పోషిస్తూ ఉండడం విశేషం. ఆచార్య సినిమాతో ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో తప్పకుండా భారీ విజయం అందుకోవాల్సిన సమయం లో ఆయన ఏ విధమైన విజయాన్ని ఈ సినిమా ద్వారా అందుకుంటాడో చూడాలి. తమన్ సంగీతం సమకూరుస్తుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట విడుదల అయ్యి అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: