సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతలం అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. కాక పోతే ఈ మూవీ విడుదల తేదీని మాత్రం చిత్ర బృందం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించ లేదు. కాక పోతే ఈ మూవీ నుండి సమంత కు సంబంధించిన ఒకటి రెండు పోస్టర్ లను మాత్రం మూవీ యూనిట్ విడుదల చేసింది.

మూవీ పోస్టర్ లలో సమంత లుక్ ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడం తో ప్రేక్షకులు ఈ మూవీ పై ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ విడుదలకు సంబంధించి మూవీ యూనిట్ ఒక ప్రణాళికలను వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయాలని దర్శక ,  నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలబడలేదు.

మరి ఈ మూవీ ని ఎప్పుడు విడుదల చేస్తారు అనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే  ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ  సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంతమూవీ తో పాటు యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కూడా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: