టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసింది. ప్రస్తుతం ఈయనటాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.


ఇకపోతే మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితార గురించి అందరికీ తెలిసిందే. గౌతమ్ ప్రస్తుతం పై చదువులు చదువుతూ చదువుపై దృష్టి పెట్టడంతో పెద్దగా సినిమాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు కానీ సితార మాత్రం ఒక వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.


ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సితారకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానంతో పంచుకుంటారు. సితార ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ మేకింగ్ వీడియోలో నటించిన విషయం మనకు తెలిసిందే. అలాగే ఈమె ప్రస్తుతం తన తండ్రితో కలిసి జీ తెలుగు ఛానల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. మహేష్ బాబు జీ తెలుగు ఛానల్ తో 9 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకొని ఈ చానల్లో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు.


 


అయితే మహేష్ బాబు రేంజ్ కి ఇలా సీరియల్స్ ప్రమోట్ చేయడం పట్ల అభిమానులు ఎంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనతో పాటు సితారని కూడా ఈ ఛానల్ ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవడంతో అభిమానులు మహేష్ బాబు తన కూతురుని ఇలా జీ తెలుగు ఛానల్ కార్యక్రమాలను ప్రమోట్ చేయడం కోసం తీసుకువచ్చి తన కెరియర్ రిస్క్ లో పెడుతున్నారు అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.. సితారలో దాగి ఉన్న టాలెంట్ చూస్తే ఆమె ఖచ్చితంగా గొప్ప నటి అయ్యే అవకాశాలు ఉన్నాయి.


 


ఇలా తన కెరియర్ పై ఫోకస్ పెట్టకుండా ఇలాబుల్లితెర కార్యక్రమాలను ప్రమోట్ చేయడం కోసం ఆమెను తీసుకురావడంతో ఆమె కెరియర్ ఇబ్బందులలో పడుతుందని పలువురు భావిస్తున్నారట.అయితే మరి కొంతమంది మాత్రం మహేష్ ఈ విషయం గురించి బాగా ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమాల కోసం సితార పెద్ద ఎత్తున డాన్స్ యాక్టింగ్ లో కూడా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈమెను వెండితెరకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: