తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు చిరంజీవి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేనప్పటికీ కూడా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అలా స్టార్ హీరోగా ఎదిగారు చిరంజీవి. ఎన్నో సంవత్సరాల నుండి ప్రేక్షకులను అలరిస్తు నే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఇదే క్రమంలోనే తన కుటుంబం నుంచి కూడా ఎంతో మంది హీరోలు చిరంజీవి ని ఇన్స్పైర్గా తీసుకొని వచ్చారు. అయితే చిరంజీవికి సెప్టెంబర్ 22వ తేదీ అనేది ఎప్పటికీ మర్చిపోలేని రోజట.



చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమా విడుదల ఇప్పటికి 44 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ నేపథ్యంలోని తనని ఆదరించిన ప్రేక్షకులు తనని ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన దర్శక, నిర్మాతలకు తమ అభిమానులకు సైతం చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ ట్వీట్  పోస్ట్ చేయడం జరిగింది. ఆ ట్విట్ లో ఇలా రాసుకోవచ్చు.. మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా 1978 సెప్టెంబర్ 22 ప్రాణం ఖరీదు చిత్రంతో తన పుట్టినరోజుగా తెలియజేశారు. 44 ఏళ్లుగా నన్ను ఇండస్ట్రీలో నడిపిస్తూ ఉన్నారని అభిమానులకు తెలియజేశారు. ఈ జన్మలో ఈ ఋణం తీర్చుకోలేని అంటూ కూడా ఒక ఎమోషనల్ పోస్టుని తెలియజేశారు చిరంజీవి.


వాస్తవానికి చిరంజీవి నటించిన మొదటి చిత్రం పునాదిరాళ్లు అయితే ఆ తర్వాత చేసిన ప్రాణం ఖరీదు సినిమా ముందే విడుదలైంది. శివశంకర్ ప్రసాదిని చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ చిత్రంలోని పాత్ర. ఇక ఈ సినిమాని డైరెక్టర్ కే వాసు దర్శకత్వం వహించారు ఈ సినిమాలో రావు గోపాలరావు, జయసుధ, చంద్రమోహన్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటించారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: