తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్స్ ఉన్న తనదైన హావా భావాలతో ఇండస్ట్రీలో కమెడియన్గా ఎంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అలీ. చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రస్థానం మొదలుపెట్టిన కమెడియన్ అలీ ఇప్పటికే ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గానే కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక తన కెరీర్లో హీరోగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్ ను అందుకున్నాడు. అయితే ఇటీవలి కాలంలో ఎంతో మంది కొత్త కమెడియన్స్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో కమెడియన్ అలీకి అడపాదడపా అవకాశాలు మాత్రమే దక్కుతున్నాయి.



 అయితే కమెడియన్గా వందల సినిమాల్లో నటించిన అలీ బుల్లితెరపై యాంకర్ గా కూడా అవతారమెత్తాడు అన్న విషయం తెలిసిందే. ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో ఎన్నో ఏళ్ల నుంచి యాంకర్గా కొనసాగుతూ వస్తున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతివారం కూడా ఒక సెలబ్రిటీ ని గెస్ట్ గా పిలవడం ఇక వారి జీవితంలోని ఎన్నో విశేషాలను ప్రేక్షకులకు తెలియజేయడం లాంటివి చేస్తూ ఉంటాడు అలీ. ఈ క్రమంలోనే ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఈ షోకి హోస్టింగ్ చేస్తున్నా కమెడియన్ అలీ ఇక ఈ షో కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అన్నది సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.


 ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హోస్టింగ్ చేయడం కోసం ఒక్కో ఎపిసోడ్కి 6.50 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట అలీ. ఇక ఇందులో అన్ని రకాల టాక్స్ లు పోగా మరికొంత తన పర్సనల్ స్టాఫ్ కి ఇవ్వగా ఒక్కో ఎపిసోడ్ 15 లక్షల వరకూ మిగులుతుందట. ఇలా నెలలు మూడు లేదా నాలుగు వారాల పాటు ఆలీతో సరదాగా కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ షో ద్వారా నెలకు 20 లక్షల వరకూ ఈ షో ద్వారా  పొందుతూ ఉన్నాడట కమెడియన్ అలీ. కాగా సినిమాలో ఆలీ రెమ్యూనరేషన్ భారీగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: