సమంత ప్రధాన పాత్ర లో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే ఒక మైథాలజికల్ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా యొక్క షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఆలస్యం కావడంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అన్న క్లారిటీ ఇప్పటిదాకా రాలేదు. తాజాగా వినిపి స్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత చేసిన మొట్టమొ దటి సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి.

ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటిస్తూ ఉండగా లేడి ఓరియంటెడ్ అవ కాశాలు కూడా రావడం ఈ ముద్దుగుమ్మకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. భారీ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచిన గుణశేఖర్ ఇటీవల కాలంలో చేసిన సినిమా లతో భారీ విజయాలను అందుకోలేకపోయాడు. దాంతో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని భావించి ఈ మైథాలజికల్ సబ్జెక్టును ఎంచుకున్నాడు. దానికి సమంత అయితే కరెక్ట్ అని భావించిన ఈ దర్శకుడు ఈ సినిమాను వేరే స్థాయిలో రూపొందించాడట.

ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకు వస్తున్న ఈ దర్శకుడు ఎలాంటి విజయాన్ని ఈ సిని మాతో అందుకుంటాడో చూడాలి. ఇటు సమంతకి కూడా ఈ సినిమా విజయం ఎంతో అవసరం. తొందరగా ఈ సినిమా విడుదల అయ్యి విజయం సాధిస్తే తప్పకుండా హిట్ అందు కునే విధంగా ఉంటుంది. మరి దీనికి సంబంధించి  విడుదలను డిసెంబర్ లో చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే మంచిదని సమంత అభిమానులు భావిస్తున్నా రు. త్వరలోనే ఈ విషయమై ఏదో ఒక క్లారిటీ రాబోతుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: