కొంతమంది హీరోలకు ఎటువంటి బ్యాడ్ లక్ ఎదురవుతుంది అంటే వారి సినిమాలు ఎందుకు ఆగిపోతాయో ఎందుకు ముందుకు వెళ్ళలేకుండా ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంటూ ఉంటుంది.  ఆ విధంగా తన తదుపరి సినిమా ల విషయం లో సాయి ధరంతేజ్ ఎంతో ఇబ్బందులు పడుతూ ఉండడం నిజంగా మెగా అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. బైక్ ఆక్సిడెంట్ కారణంగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న సాయి ధరంతేజ్ ఇప్పుడు వరుస సినిమాల్లో చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే కార్తీక్ దండు అనే దర్శకుడు తో కలిసి తొందరలోనే ఓ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అంతేకాదు మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశారు. త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది తమిళ రీమేక్ సినిమా కావడం విశేషం. అయితే ఈ సినిమా ఇదిగో అదిగో అని చెబుతున్నారు కానీ ఇప్పటిదాకా షూటింగ్ మొదలుపెట్టక పోవడం జరుగుతుంది. అంత ఎందుకు ఈ సినిమా గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోవడం అందరిని నిరాశ పరుస్తుంది.

ముఖ్యంగా సాయి ధరంతేజ్ అభిమానులను ఇది ఎంతో నిరాశ పరుస్తుంది అని చెప్పాలి. సాయి ధరమ్ కెరీర్ కి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం మంచి హెల్ప్ అవుతుంది కానీ ఏ సినిమా షూటింగ్లో పాల్గొనకుండా ఈ విధంగా ఖాళీగా ఉంచడం పై ఆయనకు ఇబ్బందిని కలిగిస్తుందని అంటున్నారు.  వాస్తవానికి ఈ సినిమా అసలు ఉందో లేదో అన్న క్లారిటీ కూడా ఇప్పుడు ఎవరికీ లేదు. తొందరలోనే దీనిపై ఇస్తే మంచిదని వారు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్సినిమా కోసం కేవలం పది రోజుల డేట్స్ డేటా ఇస్తే చాలు అనేది ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం. మరి పది రోజులను కూడా కేటాయించలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉండడం నిజంగా ఈ సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది అని చెప్పవచ్చు. దానికోసం సాయి ధరమ్ తేజ్ వెయిట్ చేయడం ఇంకా విడ్డూరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: