కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అజిత్ 'తునివు' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం అజిత్ కు సంబంధించిన రెండు పోస్టర్ లను విడుదల చేసింది. ఈ రెండు పోస్టర్ లాలి కూడా అజిత్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ఈ పోస్టర్ లు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై అజిత్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించి ఒక వార్తా కోలీవుడ్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఆజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన తునివు మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి మూవీ యూనిట్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా నటించిన వరసు మూవీ ని కూడా వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. దానితో అజిత్ హీరోగా తెరకెక్కిన తునివు మూవీ విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందా అని కోలీవుడ్ సినీ ప్రేమికులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: