మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు  ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించగా ,  టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ ఈ మూవీ లో ఒక ముఖ్య పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది  ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ తార్ మార్ తక్కర్ మార్ సాగే ఈ సాంగ్ లో చిరంజీవి , సల్మాన్ ఖాన్ వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఈ సాంగ్ కు తమన్ ఇచ్చిన సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తార్ మార్ తెలుగు వర్షన్ సాంగ్ ఇప్పటి వరకు 97 లక్షల వ్యూస్ ని , 1.3 లక్షల లైక్ లను సాధించింది. ఈ సాంగ్ హిందీ వర్షన్ 68 లక్షల వ్యూస్ ని , 2.1 లక్షల లైక్ లని సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కి తెలుగు మరియు హిందీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: