నాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా కథా నాయకిగా నటించ గా ,  మెంటల్ మదిలో ,  బ్రోచేవారెవరురా లాంటి మూవీ లతో మంచి విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని తన కంటూ దర్శకుడు గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కించుకున్న వివేక్ ఆత్రేయ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు .

మూవీ లో అనుపమ పరమేశ్వరన్ ఒక కీలక పాత్రలో నటించింది . ఈ సినిమా మంచి అంచనాల నడుమ కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది .  మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది . ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వా లేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్న అంటే సుందరనికి మూవీ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించ బోతోంది .

మూవీ శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ దక్కించు కుంది . తాజాగా జెమినీ టీవీ 'అంటే సుందరానికి' మూవీ టెలికాస్ట్ తేదీని కూడా ఫిక్స్ చేసింది. ఈ మూవీ ని జెమినీ టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అక్టోబర్ 2 వ తేదీన ప్రసారం చేయనున్నట్లు జెమినీ టీవీ నిర్వాహక బృందం అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్ లలో  ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో ఆకట్టుకున్న ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: