సాధారణంగా ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ ఒక సినిమా పూర్తైన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెట్టేవారు. అయితే  ఇక ఇండియన్2 సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో శంకర్ రామ్ చరణ్ తో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.చరణ్ మూవీ షూటింగ్ కొంతభాగం పూర్తైన తర్వాత శంకర్ వేర్వేరు కారణాల వల్ల మళ్లీ ఇండియన్2 సినిమా పనులతో బిజీ కావాల్సి వచ్చింది. అయితే  ఇక శంకర్ పనితీరు విషయంలో చరణ్ సంతృప్తితో లేరని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇకపోతే శంకర్ తన సినిమా కంటే ఇండియన్2 సినిమాకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం చరణ్ కు నచ్చలేదని తెలుస్తోంది. 

ఇక తన సినిమా విషయంలో శంకర్ సరిగ్గా దృష్టి పెట్టడం లేదని చరణ్ ఫీలవుతున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమవుతుందో చూడాల్సి ఉంది. ఇక శంకర్ చరణ్ కాంబో మూవీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కాగా దిల్ రాజు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందనే భావనను చాలామంది కలిగి ఉన్నారు. ఇక 2023 సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా 2023 సంవత్సరం దసరాకు పోస్ట్ పోన్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే  అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక చరణ్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు.రామ్ చరణ్ గత సినిమా ఆచార్య ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.ఇక  ఆచార్య సినిమాలో చరణ్ పోషించిన పాత్ర ఆయన రేంజ్ కు తగిన పాత్ర కాదని మరి కొందరు కామెంట్లు చేశారు. అయితే చరణ్ పాత్ర మరీ అద్భుతంగా ఉంటే తప్ప మల్టీస్టారర్ సినిమాలకు ఓకే చెప్పవద్దని మరి కొందరు సూచిస్తున్నారు. అంతేకాదు కెరీర్ విషయంలో స్టార్ హీరో రామ్ చరణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: