తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే సుకుమార్ పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైజ్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడుగా గుర్తింపును తెచ్చుకున్నాడు. పుష్ప ది రైస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ మూవీ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

మరి కొద్ది రోజుల్లోనే సుకుమార్ 'పుష్ప ది రూల్' మూవీ షూటింగ్ ని ప్రారంభించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో కూడా ఇప్పటికే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నటువంటి సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక మూవీ తెరకెక్కబోతున్నట్లు ఇది వరకే అధికారిక ప్రకటన వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఖుషి' మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. పుష్ప ది రూల్ మరియు ఖుషి మూవీ ల షూటింగ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కబోతున్నట్లు ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. కాకపోతే లైగర్ మూవీ ఫ్లాప్ తర్వాత సుకుమార్ ,  విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: