యూనివర్సల్ స్టార్ హీరోగా పేరుపొందారు కమలహాసన్. తాజాగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన చిత్రం విక్రమ్.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటి లో కూడా విశేష స్పందన లభించింది ఈ చిత్రానికి. ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా కమలహాసన్  ను లాభాల బాటలో ఉంచిందని చెప్పవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే తాజాగా ఈ సినిమాతో కమలహాసన్ ఒక సంచలనం సృష్టించాడనే వార్త వినిపిస్తోంది.

సినిమా థియేటర్ రన్ టైం నిన్నటితో ముగిసింది నిన్నటి వరకు కూడా ఈ సినిమా కోయంబత్తూర్ లో ఒక థియేటర్లో ఆడింది. ఎట్టకేలకు అక్కడ కూడా తొలగించడం జరిగింది. దీంతో ఈ సినిమా థియేటర్ రన్ టైం ముగిసిందని చెప్పవచ్చు. ఈ సినిమా తాజాగా ఓటీటి లో కూడా స్ట్రిమింగ్ కావడం జరిగింది. పదేళ్ల తమిళ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకు రానంతమంది ఈ సినిమా కోసం థియేటర్ కి ప్రేక్షకులు వచ్చినట్లు సమాచారం. ఇది ఒక గొప్ప రికార్డుగా తమిళ సినీ ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు.

కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ ఏమవుతుందో అని అందరూ భయం భయంగా ఉన్నారు. కానీ అనూహ్యంగా విక్రమ్ సినిమా విడుదలవ్వడంతో పలు రికార్డులను సైతం సృష్టించింది ఈ సినిమా. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఇక తమిళనాడులో అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా నిలిచింది ఈ చిత్రం. అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాగా కూడా నిలిచింది అత్యధిక మంది వీక్షించిన ప్రేక్షకుల జాబితాలో కూడా ఈ సినిమా చేరిపోయింది. ఈ విషయాలన్నీ ప్రముఖ బాక్స్ ఆఫీస్ విశ్లేషకుడు రమేష్ బాల తెలియజేయడం జరిగింది. దీంతో కమల్ హాసన్ తన తదుపరి చిత్రాల పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: