సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఈ సంవత్సరం విడుదలైన సర్కారు వారి పాట మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. పరుశురామ్మూవీ కి దర్శకత్వం వహించగా , సముద్ర ఖనిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇలా సర్కార్ వారి పాట మూవీ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీరోగా నటిస్తున్నాడు.

మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తేరకెక్కుతుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. అందులో భాగంగా ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. మొదటి షెడ్యూల్ లో భాగంగా ఈ మూవీ యూనిట్ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది. ఇది ఇలా ఉంటే దసరా తర్వాత ఈ మూవీ యూనిట్ రెండవ షెడ్యూల్ షూటింగ్ ని ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

అలాగే రెండవ షెడ్యూల్ షూటింగ్ లో పూజ హెగ్డే  కూడా పాల్గొనబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ  సెకండ్ షెడ్యూల్ షూటింగ్ అక్టోబర్ 9 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: