తన అద్భుతమైన నటన తో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమన్నా ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ లలో నటించి తన అందచందాలతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీ లలో కూడా నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నా 'బాబ్లీ బౌన్సర్' అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కి మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించగా , వినీత్ జైన్, అమృతా పాండే లు ఈ మూవీ ని నిర్మించారు. అభిషేక్ బజాజ్, ప్రియం సాహా, సౌరభ్ శుక్లా, సుప్రియా శుక్లా, సాహిల్ వైడ్ తదితరులు ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ విడుదలకు ముందు బబ్లీ బౌన్సర్ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్న విధంగా ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మూవీ లో తమన్నా బౌన్సర్ పాత్రలో కనిపించబోతుంది. ఇలా తమన్నా బౌన్సర్ పాత్రలో కనిపించడంతో ఈ మూవీ పై తమన్నా అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా థియేటర్ లాలి కాకుండా నేరుగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  విడుదల అయ్యింది. ఈ మూవీ ఈ రోజు నుండి అనగా సెప్టెంబర్ 23 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమన్నా తాజాగా నటించిన బాబ్లీ బౌన్సర్  సినిమా నేరుగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: