తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాత గా , డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దిల్ రాజు తన కెరియర్ లో ఎన్నో విజయ వంతమైన మూవీ లకు నిర్మాతగా వ్యవహరించాడు. అలాగే దిల్ రాజు తన కెరియర్ లో ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశాలను ఇచ్చి ,  వారితో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో మూవీ లను నిర్మిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ ని నిర్మిస్తున్నాడు. అలాగే తమిళ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ క్రేజీ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తమిళ మరియు తెలుగు భాషలో ఒక మూవీ ని నిర్మిస్తున్నాడు.

మూవీ తమిళ్ లో వరసు పేరుతో విడుదల కానుండగా ,  తెలుగు లో వారసుడు పేరుతో విడుదల కానుంది.  అలాగే హిందీ లో కూడా దిల్ రాజు ఇప్పటికే కొన్ని మూవీ లను నిర్మించాడు. ఇలా సినిమా నిర్మాణలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న దిల్ రాజు ఒక సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు దర్శకత్వం వహించబోయే సినిమాకు సంబంధించిన కథా పనులను ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు ,  మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ ని ప్రారంభించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: