కేజిఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్  నీల్ ఈ సిని మా యొక్క రెండు భాగాల తో సంచలన విజయంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లను అందుకొని భారీ సినిమాలు చేసే పాన్ ఇండియా దర్శకుల వరుసలో నిలిచాడు. అంతకు ముందు రాజమౌళి ఇలాంటి సినిమాలు చేసి దేశ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేయగా ఈ దర్శకుడు దానిని మరొక మెట్టు ఎక్కించాడు అని చెప్పాలి.

అయితే వీరిద్దరిలో కూడా ఒక కామన్ పాయింట్ ఉందని కొంతమంది సినిమా విశ్లేషకులు ఇప్పుడు వారి గురించి విశ్లేషణ చేస్తున్నా రు. రాజమౌళి తన సినిమాలను ఎంత అద్భుతంగా చేస్తాడు అన్న పేరు ఉన్నట్లే ఆ సినిమాలను ఎంతో ఆలస్యంగా చేస్తాడు అన్న విమర్శ కూడా ఉంది. ఒక సినిమా కో సం రెండేళ్ల నుంచి మూడేళ్ల సమయం తీసుకుని దానిని ఎంతో పగడ్బందీగా విడుదల చేసి మంచి కలెక్షన్లు వచ్చేలా చేసుకుంటాడు. ఆ విధంగానే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. 

ఆ తరువాత చేస్తున్న సలార్ చిత్రం కోసం కూడా ఇంకా ఎక్కువ సమయాన్ని తీసుకోవడం ప్రభాస్ అభిమానుల ను ఏమాత్రం ఆనంద పరచడం లే దు. వాస్తవానికి సలా ర్ సినిమాను ప్రశాంత్ ఎప్పుడో మొదలుపెట్టాడు. ఈ ఏడాది వేసవి లోనే ఆ సినిమాను విడుదల చేయవలసి ఉంది. కానీ ఇప్పటి కీ ఆ సినిమా షూటిం గు పూర్తి చేయకపోవడంతో పాటు ఆ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ కు విడుదల చేయాలని నిర్ణయానికి రావడం నిజంగా ప్రభాస్ అభిమానులను కోపం తెప్పించే పని అని చెప్పాలి. మరి దీనిపై ప్ర భాస్ మళ్ళీ ఆలోచించి సరికొత్త విడుదల తేదీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడా అనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: