తెలుగు సినిమా హీరోలకు పండగ సమయాలలో సినిమాలను విడుదల చేయడం అంటే ఎం తో ఇష్టం. ఎందుకంటే ఆ సీజన్లో ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలా ఇప్పటిదాకా ఎంతో మంది హీరోలు దసరా సంక్రాంతి పండగల సందర్భం గా తమ సినిమాలను విడుదల చేసి భారీ విజయాలతో పాటు మంచి వసూలను కూడా రాబట్టారు. ఈ ఏడాది దసరా సంక్రాంతి వంటి పండగలకు కూడా ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన సినిమాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దసరా పండుగ మరొక పది రోజులలో ఉండగా ఆ సీజన్లో వచ్చే సినిమాల కు సంబంధించిన క్లారిటీ రాగా సంక్రాంతి కి విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన క్లారిటీ రాకపోవడం సినిమా అభిమానులను కొంత కలవర పెట్టిస్తుంది. అప్పటికే ప్రభాస్ హీరోగా నటిం చిన ఆది పురష్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చెబుతున్నారు. కానీ దీనికి సంబంధించిన ప్రకటన ఇవ్వకపోవడం ఎన్నో అనుమానాలను కలగజేస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్లు కూడా విడుదల కాకపోవడంతో ఈ సినిమా విడుదలవుతుందా అన్న అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు.

ఇకపోతే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చెప్పుకొస్తున్నారు. దీని గురించి కూడా చిత్ర బృందం ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడం కొన్ని అనుమానాలను కలుగచేస్తుంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి నటించిన బాబి సినిమాను కూడా అప్పుడే విడుదల చేస్తున్నామని చెబుతున్నారు మరి దీనిపై ఓ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మళ్లీ పండుగ సీజన్లో ఆయన ఇంకొక సినిమాను విడుదల చేస్తారు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాల్సి ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: