ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా యొక్క షూటింగ్ ఇప్పుడు శెరవేగంగా జరుపుకుంటుంది. కేజీఎఫ్ సినిమా తరువాత అంతటి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న ఈ సినిమా తప్పకుండా సంచలన విజయంతో పాటు భారీ వసూళ్లను కూడా అందుకోవడం ఖాయం అని చెబుతున్నారు. ఆ విధంగా ప్రశాంత్ నీల్సినిమా కోసం చాలా సమయాన్ని కేటాయించుకోవడం ప్రభాస్ అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది.

ఎప్పుడో అనౌన్స్ అయినా కూడా ఈ సినిమాను మొన్నటిదాకా షూటింగ్ చేయలేదు దానికి పలు కారణాలు కారణమైనా కూడా ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ కు పోస్ట్ ఫోన్ అవడం అందరిని నిరాశపరిచే విషయమనే చెప్పాలి. అసలే వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ ఈ చిత్రంతో ఘనవిజయం అందుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎందుకు ఇంతటి ఆలస్యం అవుతుందో అన్న అయోమయం వారిలో నెలకొంది. 

దానికి తోడు ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది అనే వార్తలు రావడం అభిమానులను ఎంతగానో సంతోష పెట్టిస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయం బయటపడింది ఈ సినిమాకు రెండు భాగాలుగా చేయాలని అనుకోవడమే ఈ చిత్రం యొక్క విడుదల ఆలస్యం అవుతుందని చెబుతున్నారు దర్శకుడు కి వచ్చిన ఈ ఆలోచన వల్లనే తొలిభాగం విడుదల ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. కేజీఎఫ్ 2 భాగాలతో ప్రేక్షకులను అలరించిన ప్రశాంత నీల్ అదే సెంటిమెంట్ను కొనసాగిస్తూ ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి తొందరగా ఈ సినిమాను విడుదల చేసి ప్రభాస్ యాక్షన్ సినిమాలను కోరుకునే వారిని సంతోష పెడతారని చూడాలి. ఇక ప్రభాస్ చేయబోయే సినిమాల యొక్క లైనప్ బాగానే ఉంది. మరో మూడు పాన్ ఇండియా సినిమాలను ఒప్పుకునే విధంగా ఆయన రంగం సిద్ధం చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: