అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా సినిమా ఘోస్ట్.  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఉగ్రవాదం నేపథ్యంలో రూపొందిన ఈ తరహా సినిమాలను నాగార్జున చేయడం కొత్త ఏమీ కాదు. గతంలో కూడా ఇలాంటి నేపథ్యమ్ ఉన్న సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించిన నేపథ్యంలో ఈ సినిమా యొక్క కథపై ఎంతో నమ్మకం ఉంచిన నాగార్జున ఈ సినిమాను చేయడం జరిగింది. దానికి తోడు హిట్ సినిమాలు చేసే ప్రవీణ్ సత్తారు తోడవడంతో ఈ సినిమా ఇంతటి స్థాయిలో రూపొంది పడింది అని చెబుతున్నారు.

సయామీ కేర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని ముందుగా భావించారు కానీ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో నాగార్జున ఒక అడుగు వెనక్కి తగ్గి తన సినిమా విడుదల తేదీని మార్చుకున్నాడని తెలుస్తుంది. చాలా రోజులుగా వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతున్న నేపథ్యంలో నాగార్జున ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వారిద్దరి మధ్య ఎంత మంచి స్నేహం ఉందో చెప్పడానికి నిదర్శనం. 

కదల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషన్ కార్యక్రమాలు జరగగా వాటిలో పాల్గొన్న నాగార్జున కొన్ని ఆసక్తికర విషయాలను సినిమా గురించి వెల్లడించారు. ముందుగా ఈ సినిమాకు గాంధీ అనే టైటిల్ను నిర్వహించారట కానీ ఆ తరువాత కథకు ఆప్ట్ అని తెలిసి గోస్ట్ అనే టైటిల్ పెట్టడం జరిగింది అని ఆయన వెల్లడించారు. ఏదేమైనా టైటిల్ ద్వారా సినిమా బృందం చిత్రంపై మంచి బజ్ ఏర్పాటు చేసిందని చెప్పాలి. నాగార్జున కూడా ఇలాంటి సమయంలో ఒక మంచి విజయం అందుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ చిత్రంపై పాజిటివ్ వైస్ ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశం మరి ఎంతో నమ్మకం పెట్టుకొని చేసిన ఈ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: