మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు పలు సినిమాలో రూపొందుతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా విడు దలకు సిద్ధం చేసిన చిరంజీవి ఇప్పుడు మరో రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే భోళాశంకర్ చిత్రాన్ని పూర్తిచేసి పోస్టు ప్రొడక్షన్ పనులు జరిగేలా చేశాడు. అంతేకాదు ఇప్పుడు బాబీ దర్శకత్వంలో రూపొందే సినిమాలో షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండడం అందరిలో ఎంతో ఆసక్తిని కలగ చేస్తుంది. 

ఇప్పుడు మరో ఇద్దరు సీనియర్ హీరోలు కూడా ఈ జాబితాలోకి చేరడం నిజంగా సినిమా పట్ల ఎంతో ఆస క్తిని కలగజేస్తుంది. ఆచార్య సినిమా తరువాత గాడ్ ఫాదర్ సినిమా తో మంచి విజయం అందుకోవాలని చిరంజీవి భావిస్తున్న నేపథ్యంలో ఆ చిత్రం కోసం సల్మాన్ ఖాన్ తీసుకువచ్చి సినిమాపై మంచి బజ్ ఏర్పడే విధంగా ప్రయత్నాలు చేశాడు. ఆ విధంగా ఎన్నో అంచనాల మధ్య గాడ్ ఫాదర్ సినిమాను అక్టోబర్ 5వ తేదీన దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మెగాస్టార్ చిరంజీవి సర్వం సిద్ధం చేశారు.

 ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి 28వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది 25వ తేదీన ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల చేయబోతున్నారని చెబుతున్నారు.  ఆ తరువాత బాబీ దర్శకత్వంలో తనకక్క సినిమా కోసం మరో ఇద్దరు స్టార్ హీరోలను తీసుకురావడం మెగాస్టార్ చిరంజీవికి కలిసి వస్తుంది అని చాలామంది చెబుతున్నారు. అక్కినేని నాగార్జున మరియు విక్టరీ వెంకటేష్ ఇద్దరు కూడా ఈ సినిమాలో కొన్ని కీలక పాత్రలలో నటిస్తున్నారట. ఆ విధంగా మొత్తం నలగురు స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తూ ఉండడం సినిమా పట్ల అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: