ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు పొందిన సినిమా RRR. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని, ఆస్కార్ వస్తుందని చాలా మంది అభిమానులతో పాటు సినీ లోకం కూడా ఎంతగానో ఆశించారు. కానీ అసలు ఆస్కార్ బరిలో కూడా సినిమా నిలవలేదు.రాజమౌళి ప్రస్తుతం హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్స్ లో బిజీగా ఉన్నాడు. అక్కడి మీడియాతోనే ఆస్కార్ వచ్చినా రాకపోయినా నా ఫిలిం మేకింగ్ మారదని తెలిపాడు. ఆస్కార్ నామినేషన్స్ లో rrr సినిమా లేకపోవడంపై ఒక్కక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై హీరో నిఖిల్ మాట్లాడాడు.ఈ మధ్యనే కార్తికేయ 2 సినిమాతో ఇండియా వైడ్ భారీ విజయం సాధించి, 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ సృష్టించాడు యువ హీరో నిఖిల్. ప్లాన్ చేయకుండానే పాన్ ఇండియా హీరో అయ్యాడు నిఖిల్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిఖిల్ ని rrr సినిమా ఆస్కార్ నామినేషన్స్ కి సెలెక్ట్ కాకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. దీనికి నిఖిల్ ఆసక్తిగా సమాధానం చెప్పాడు.


నిఖిల్ మాట్లాడుతూ.. ”నాకు ఆస్కార్ పై వేరే అభిప్రాయం ఉంది. చాలా మంది ఆస్కార్‌ను ఇష్టపడతారు. కానీ నా వరకు ఒక సినిమాకు అతి పెద్ద విజయం అంటే ప్రజల నుంచి ప్రేమ, ప్రశంసలను పొందడమే. నాకు తెలిసినంతవరకు అదే అతి పెద్ద అవార్డు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాని ఆదరించారు. ఆ సినిమాకి అదే పెద్ద విజయం. అలాంటప్పుడు ఇంక ఆస్కార్ ఎందుకు? మనకు ఫిల్మ్‌ఫేర్‌, జాతీయ అవార్డులు.. ఇలా మన దేశంలోనే చాలా అవార్డులు ఉన్నాయి. నేనైతే ఆస్కార్ కి అంత ప్రాముఖ్యత ఇవ్వను. ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి అసలు మనకు ఆస్కార్‌ సర్టిఫికేట్‌ ఎందుకు?. మన సినిమాలు చాలా బాగుంటాయి, విడుదలయిన అన్ని చోట్ల ఇప్పుడు భారతీయ సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఇటీవల నేను స్పెయిన్‌లో rrr సినిమా చూశాను. అక్కడ థియేటర్స్ అన్ని హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన సినిమాని అభినందిస్తుంటే ఇంక ఆస్కార్ అవసరంలేదు అని నా ఫీలింగ్” అన్నారు. దీంతో నిఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: