గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో.. ప్రసవం తర్వాత కూడా శారీరకంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. కొంత మంది మహిళలు బరువు పెరుగుతారు.

నీరసంగా ఉంటారు. చురుకుదనం ఉండదు.. గర్భధారణకు ముందు ఉన్నట్లు శరీరం సహకరించదు. అయితే ఇలా అందరి విషయంలో జరగదు. కొంత మంది ప్రసవతం తర్వాత కూడా ఎప్పటిలాగే ఎంతో ఉత్సాహంగా, సంతోషం గా ఉంటారు. తమ అందాన్ని కూడా కాపాడుకుంటారు. చాలా మంది సెలబ్రిటీల శరీరం ప్రసవం తర్వాత మునుపటిలా ఉండదు.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ విషయంలోనూ అలాగే జరుగుతుందట.. గర్భధారణకు ముందులా తన శరీరం సహకరించడం లేదని కాజల్ చెబుతోంది..

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది చందమామ సినిమా హీరోయిన్ కాజల్ అగర్వాల్.. సినిమాలు చేస్తుండగానే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. ఆ వెంటనే గర్భం కూడా దాల్చింది. తర్వాత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. బాబు పుట్టిన నాలుగు నెలల తర్వాత కాజల్ అగర్వాల్ సినిమాల్లో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది.. ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అయ్యింది. నటి కాజల్ అగర్వాల్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్-2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల రెండు సంవత్సరాలు నిలిచిపోయింది. ఇటీవల షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.

ఈక్రమంలో డెలివరీ తర్వాత ఆమె శరీరం లో వచ్చిన మార్పుల గురించి తన ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. డెలివరీ తర్వాత శరీరంలో జరిగిన మార్పులు పై షూటింగ్ కోసం ఎలా సిద్ధమైంది అనే విషయాలను వివరించింది. డెలివరీ అయిన నాలుగు నెలల తర్వాత తాను తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నానని చెప్పింది.. అయితే గతంలో ఉన్నట్లు అంత ఈజీగా లేదని, కొత్తగా మొదలు పెట్టినట్లు ఉందని తెలిపింది.. డెలివరీకి ముందులా తన శరీరం ఇప్పుడు సహకరించడం లేదని చెప్పింది.

డెలివరీకి ముందు లోకేషన్స్ లో వర్క్ చేసిన తర్వాత ఎక్సర్ సైజ్ చేసేదాన్నని, అయినా అలసిపోయినట్లు అనిపించేది కాదని కాజల్ చెప్పింది. కానీ ఇప్పుడు ముందులా ఎనర్జీ లెవెల్స్ పొందడం చాలా కష్టంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం గుర్రపు స్వారీ చేయడం కూడా పెద్ద టాస్క్ అనిపించిందని పేర్కొంది. పరిస్థితుల ప్రభావం వల్ల శరీరంలో మార్పు జరగవచ్చని, కానీ ఆత్మవిశ్వాసం తగ్గకూడదని, అందుకే తనకు తాను అప్ డేట్ చేసుకుంటున్నానని పోస్ట్ లో కాజల్ అగర్వాల్ వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: