ఒక హీరోయిన్ నటించిన సినిమా బ్లాక్ బష్టర్ హిట్ అయితే ఆమెను వెంటనే గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా చెప్పుకుంటూ ఆమెను ఆకాశంలోకి ఎత్తేసి పారితోషికం కూడ కోట్లాది రూపాయలలో ఇస్తారు. ఒకవేళ ఆ హీరోయిన్ నటించిన సినిమాలు అనుకోకుండా వరసగా ఫ్లాప్ అయితే ఆమెను ఐరన్ లెగ్ హీరోయిన్ గా స్టాంప్ వేసి ఆమెతో సినిమాలు చేయడానికి ఎవరు పెద్దగా ఆశక్తి కనపరచరు.

 
 వాస్తవానికి ఒక సినిమా హిట్ ఫ్లాప్ ల విషయంలో హీరోయిన్ ల పాత్ర ఏమాత్రం ఉండదు. సినిమా కథ అంతా హీరోల చుట్టూనే తిరుగుతుంది. ఇప్పటికీ హీరోయిన్స్ ను గ్లామర్ డాల్స్ గానే చూస్తున్నారు. అయినప్పటికీ ఒక సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్ మార్కెట్ హీరో మార్కెట్ కంటే వేగంగా పడిపోతుంది.

 

 ఇలాంటి పరిస్థితులలో ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ పరిస్థితి అయోమయంలో పడిందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి. వీరిలో మొదటి వరసలో ఉన్నది రాశి ఖ‌న్నా. ఆమె నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ ఉండటంతో మీడియం రేంజ్ హీరోలు కూడ ఈమె వైపు చూడటం లేదు. ఇక ఈ లిస్టులో రెండవ స్థానంలో ఉన్నది. కేతిక శర్మ ఈమె నటించిన ‘రోమాంటికి’ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ వైష్ణవ్ తేజ్ తో నటించిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా హిట్ అవుతుందని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది.

 

 అయితే ఆమూవీ కూడ ఫ్లాప్ కావడంతో ఆమె వైపు దర్శక నిర్మాతలు చూడటంలేదు అన్నవార్తలు వస్తున్నాయి. ఇక ఈ లిస్టులో అత్యంత దురదృష్ట వంతురాలుగా ఇండస్ట్రీలో పేర్కొనబడుతున్న హీరోయిన్ కృతి శెట్టి. ‘ఉప్పెన’ తరువాత ఆమె తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరొక సౌందర్య అవుతుంది అంటూ ఆకాశానికి ఎత్తేసారు. అయితే ఈమూవీ తరువాత ఆమెను వరస ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి. దీనితో ఈమె కెరియర్ కు కూడ ప్రమాద హెచ్చరికలు మొదలయ్యాయి అంటూ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: