ప్రస్తుతం టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోల చేతుల్లో రెండు, మూడు సినిమాలే ఉన్నాయి. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల పరిస్థితి కూడా ఇంతే.


అందుకే కొంతమంది దర్శకులకు హీరోలు దొరకడం లేదు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన దర్శకులు కూడా హీరోల కోసం వెతుకులాట మొదలుపెట్టారట.. 'పడి పడి లేచే మనసు' సినిమాతో ప్లాప్ అందుకున్న హను రాఘవపూడి ఈ ఏడాది 'సీతారామంతో హిట్ కొట్టారు.


ఆయన తదుపరి సినిమా మైత్రి మూవీ మేకర్స్ లో కన్ఫర్మ్ అయిందట.కానీ హీరో మాత్రం లేడు. హీరో దొరికితే హను దగ్గర కథ రెడీగా ఉంది. మైత్రి నిర్మాతలు ప్రస్తుతం హను కథకు సూటయ్యే హీరోని వెతికే పనిలో ఉన్నారు. వారి దగ్గర చాలా మంది హీరోల కమిట్మెంట్స్ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఎవరూ ఫ్రీగా అయితే లేరు. దర్శకులు చందు మొండేటి, వశిష్ట పరిస్థితి కూడా ఇలానే ఉంది.


 


'కార్తికేయ2', 'బింబిసార' సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అనిపించుకున్న వీరు గీతాఆర్ట్స్ లో నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు. కానీ హీరోలు లేకపోవడంతో వీరి సినిమాలు ఆలస్యమవుతున్నాయి. చందు మొండేటి కొన్ని నెలలుగా గీతాఆర్ట్స్ కోసం కథ రెడీ చేస్తున్నారు. మధ్యలో విజయ్ దేవరకొండను చందు చేతిలో పెట్టాలని చూశారు కానీ విజయ్.. పూరితో రెండు సినిమాలు, మైత్రిలో ఒకటి, సుకుమార్ తో మరొక సినిమా కమిట్ అవ్వడంతో చందుతో సినిమా సెట్ అవ్వలేదట.


ఇప్పుడు 'కార్తికేయ2' సినిమా తరువాత చందు మొండేటికి బాలీవుడ్ లో మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. అందుకే రెండు భాషలకు తగిన హీరోను సెలెక్ట్ చేసుకోవాలని భావిస్తున్నారు. అల్లు అరవింద్ ఆలోచన కూడా ఇదే. ఇక వశిష్ట దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. కానీ ఇతడికి కూడా హీరోలు దొరకడం కష్టంగా ఉందట.. మరి ఈ ముగ్గురు దర్శకులకు హీరోలు ఎప్పుడు దొరుకుతారో? సినిమాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: