తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.ఇక ఇందులో అందరూ సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చు. అభిమానులు కూడా తమ అభిమాన హీరోలకు సంబంధించి పలు పోస్టర్లను ఫ్యాన్ మేడ్ పోస్టర్ను క్రియేట్ చేస్తూ ఉంటారు .తాజాగా ఇప్పుడు అలాంటి ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేయగా ఆ పోస్టర్ కాస్త వైరల్ గా మారుతోంది. అది కూడా చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్ సినిమాని ఊహించి ఇలాంటి పోస్టర్ను చేసినట్టుగా కనిపిస్తోంది.


గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల ఐదవ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం సరిగ్గా విడుదలకు 11 రోజులు ఉండడంతో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్లను చాలా వేగవంతంగా చేస్తుంది. ఇక నిన్నటి రోజున శ్రీముఖి, చిరంజీవి ఫ్లైట్లో చిట్ చాట్ వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఈనెల 25వ తేదీన పూర్తిస్థాయిలో ఇంటర్వ్యూకు సంబంధించి వీడియోని విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా నిన్నటి రోజున పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర మేకర్ గాడ్ ఫాదర్ కొత్త పోస్టర్  విడుదల చేశారు. అయితే ఈ ఫోటోని ఉపయోగించుకొని రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ,చిరంజీవి ఇలా అందరూ కలిసి లుంగీతో ధరించిన ఒక స్టిల్ గల ఫోటోని క్రియేట్ చేశారు ఫ్యాన్స్ మేడ్. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ని గాడ్ ఆఫ్ మాసేస్, చిరంజీవిని మాసేస్, రామ్ చరణ్ ని మ్యాన్ ఆఫ్ మాసేస్ అనే విధంగా ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా అద్భుతంగా ఉందని అభిమానుల సైతం మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: