ఊహలు గుసగుసలాడే సినిమాతో మొదటిసారిగా సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.ఈ క్రమంలోనే పలు సినిమా అవకాశాలను అందుకుంటూ యువ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు నాగశౌర్య. అయితే తను ఆశించిన స్థాయిలో ఏ సినిమా కూడా సక్సెస్ కాలేకపోయింది. అయితే తాజాగా కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ అనిష్ కృష్ణ దర్శకత్వంలో పెరగా ఎక్కించారు ఇందులో హీరోయిన్ గా షిర్లే సేటియా నటించింది.


ఈ చిత్రం శుక్రవారం రోజున థియేటర్లలో విడుదలై మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఆడియన్స్ ను ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. సాధారణమైన కథతో ఎక్కడ బోర్ కొట్టకుండా కొత్తరకం సన్నివేశాలతో కామెడీతో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ను బాగా అలరించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో హీరో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడి పాత్రలో అద్భుతంగా నటించారని అభిమానుల సైతం తెలుపుతున్నారు. ఈ కథలోని కీలకమైన సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో ఈ సినిమా వీకెండ్ వస్తువులు బాగానే రాబట్టే అవకాశం చెప్పవచ్చు.


నాగశౌర్య చాలా గ్యాప్ తర్వాత మంచి రిలీఫ్ ఇస్తే సినిమాలు నటించారని చెప్పవచ్చు ఎందుచేత అంటే ఈ సినిమా కోసం నాగశౌర్య చాలా కష్టపడ్డాడని చెప్పవచ్చు. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం వెరైటీగా పాదయాత్ర కూడా చేశారు. తన సినిమాని జనాలలోకి తీసుకువెళ్లడానికి పలు నగరాల్లో నడుచుకుంటూ వెళ్లి అందరి దృష్టిని బాగా ఆకర్షించారు. ముఖ్యంగా ఈ సినిమాకి పాదయాత్రని మంచి హెల్ప్ చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులే ఇలాంటి పాదయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే నాగశౌర్య కొత్తగా ఆలోచించి ఈసారి భిన్నంగా ఇలా ప్రచారం చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: