అక్కినేని కోడలుగా సమంత వున్న విషయం అందరికి తెలిసిందే..ఈ విషయం పై అక్కినేని ఫ్యాన్స్ సంతోషించారు..వారిద్దరి విడిపోవడానికి కారణం తెలియక బాధ పడ్డారు.చై,సామ్ విడిపోయి ఏడాది కావొస్తుంది..ఇద్దరు ఎవరి దార్లలో వారు పయనిస్తున్నారు. అయినప్పటికీ ఈ ఇద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాగ చైతన్య హీరోయిన్, శోభిత దూళిపాళ్లతో ప్రేమాయణం నడుపుతున్నాడని రెండో వివాహం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. చాలా కాలానికి ఆ ప్రచారం సమసిపోయింది కూడా. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రచారం మొదలైంది. అదేమిటంటే సమంత రెండో పెళ్లికి సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది..


తమిళనాడుకు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని, దీనికి ఆమె బాగా విశ్వసించే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కారణమయ్యారని తెలుస్తోంది.సమంత మొదటి పెళ్లి పెటాకులయి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయన సమంతకు ఆధ్యాత్మికంగా కొన్ని మంచి విషయాలు చెప్పి ప్రేరేపించారని, దీంతో సమంతకు రెండో వివాహం చేసుకోవాలని కూడా ఆయనే సలహా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ అమ్మడు రెండో పెళ్లికి సంబంధించిన వార్త బయటకు రానుందని సమాచారం...ఇప్పుడు సామ్ అమెరికాలో ఉంది.


సమంత చైతూలకు విడాకులు అవ్వడం వల్ల ఇప్పుడు నాగార్జున నానా కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత నాగచైతన్యకు సంబంధించిన ప్రతి విషయాన్ని సమంత దగ్గరుండి చూసుకునేవారట. అంతే కాకుండా ఆర్థిక లావాదేవీలు.. సినిమా డేట్స్ సైతం సమంత చూసుకునేదట. ఇక సమంత చైతూకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె పని ఆమె చూసుకుంటుంది. దాంతో ఇప్పుడు చైతూ డైట్, ఆర్థిక వ్యవహారాలు, సినిమా డేట్స్, కథల ఎంపిక బాధ్యతలను నాగార్జున చూసుకోవాల్సి వస్తుందట.కాగా, నాగార్జున త్వరలో ఘోస్ట్ చిత్రంతో పలకరించబోతున్న విషయం తెలిసిందే..మరి రెండో పెళ్ళి విషయం పై సామ్ ఏం చెబుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: