ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు అంతా ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఆస్కార్ అవార్డుల నామినేషన్ దక్కుతుంది అని ఆశిస్తున్న సమయంలో తెలుగువారి ఆశలను గుజరాతి సినిమా ‘చెల్లో షో’ నీరు కార్చింది. దీనితో ఆసినిమాలో అంత గొప్పతనం ఏముంది అంటూ చాలామంది ఆసినిమా గురించి వివరాలు సేకరించడం ప్రారంభించారు.


వాస్తవానికి మన దేశం నుండి ఆస్కార్ అవార్డుల కోసం ఏదో ఒక సినిమాను ఎంపికచేసి పంపడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆసినిమా గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ ను దెబ్బకొట్టి ‘చెల్లో షో’ ముందుకు రావడంతో ఈమూవీ గురించి విపరీతంగా జనం పట్టించుకుంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి హాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ క్రిటిక్స్‌ తో పాటు అమెరిక‌న్ మీడియాలో కూడ ప్రశంసలు లభించడంతో పాటు కొన్ని హాలీవుడ్ పత్రికలు ఏకంగా ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఎదో ఒక అవార్డు వస్తుందని ఊహగానాలు మొదలుపెట్టడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ లో కూడ ఆశలు చిగురించాయి అంటారు.  


అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ ను పక్కకు పెట్టి ‘చెల్లో షో’ ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేయడం వెనుక ఏదో ఒక రాజకీయం నడిచిందని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. ఎన్నో విష‌యాల్లో ద‌క్షిణాది మీద వివ‌క్షత చూపిస్తూ ఉత్తరాది ఆదిపత్యానికి ఇది ఒక ఉదాహరణ అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.


కానీ కొందరు మాత్రం ఏదో ఒక గొప్పతనం లేకుండా ‘చెల్లో షో’ ను ఎందుకు నామినేట్ చేస్తారు అంటూ మరికొందరు వాదిస్తున్నారు. ‘చెల్లో షో’ గొప్ప సినిమా అయిన‌ప్ప‌టికీ అది ఒరిజనల్ కాదు అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ మూవీ  ‘పార‌డైసో’ అనే విదేశీ చిత్రానికి రీమేక్ అన్న మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ చిత్రానికి 1988లోనే ఆస్కార్ అవార్డు వ‌చ్చింది అంటున్నారు. ఈరెండు సినిమాల పోస్ట‌ర్లను పక్కకు పెట్టి ఈమూవీ కాపీ అంటూ రగడ సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈవిషయాలు ఆస్కార్ ప్యానల్ కు తెలిస్తే ఏమవుతుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: