తెలుగు సినీ పరిశ్రమలో ప్రఖ్యాతలు కాంచిన నటులలో ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. సినీ పరిశ్రమకు సరికొత్త హంగులను పరిచయం చేయడంలో ఈ ఇద్దరు హీరోలు ముందు వరుసలో ఉంటారు.
ఇక ఒకానొక సమయంలో టాప్ హీరోల పొజిషన్ కోసం ఇద్దరు హీరోలు పోటీ పడడం కూడా జరిగింది. అంతేకాకుండా మంచి స్నేహితులు కూడా విరే.. అయితే ఎంత మంచి స్నేహితులు అయినా సరే.. ఏదో ఒక విషయంలో పలు విభేదాలు వస్తూనే ఉంటాయి.అలా వీరిద్దరి మధ్య ఒక విషయంలో విభేదాలు వచ్చినట్లుగా సమాచారం.ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

గుమ్మడి వెంకటేశ్వరరావు రాసుకున్న తన డైరీలోని ఒక పేజీలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా సమాచారం. అక్కినేని నాగేశ్వరరావు,ఎన్టీఆర్ ఒకే జిల్లా నుంచి మద్రాస్ కు వెళ్లి పలు సినిమాలలో అవకాశం కోసం చాలా కష్టపడి అవకాశాలను సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కూడా అన్నదమ్ముల అనుబంధంతోనే మంచి స్నేహితుడుగా ఉండే వారు అన్నట్టుగా ఆయన తన డైరీలో రాసుకున్నట్లుగా సమాచారం. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి ముఖ్య కారణం రాజకీయాలే నట. ఆ రాజకీయాల కారణం వల్లే 1960లో అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాదుకు రావడం జరిగింది అట. అలా షూటింగ్ లు అన్నీ కూడా హైదరాబాదులోనే చేసేవారట.
అయితే నందమూరి తారకరామారావు గారు మాత్రం తమిళనాడులోని తన స్నేహితులను,బంధువులను విడిచి రాలేక అక్కడే షూటింగ్ అన్ని చేసుకునేవారట. అలా ఒకసారి అనుకోని విధంగా షూటింగ్ కోసం హైదరాబాదుకు వచ్చినప్పుడు ఆ సమయంలో ఇద్దరు హీరోలు అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. ఎన్టీఆర్ ను హైదరాబాదుకు రాకుండా అడ్డుకున్నారట. అలా అక్కినేని అభిమానులు ఎన్టీఆర్ పై ఏదో ఒక దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు.ఆ అభిమానుల వల్ల వీరిద్దరి మధ్య కాస్త విభేదాలు వచ్చి దాదాపుగా ఐదు సంవత్సరాలకు పైగా మాట్లాడుకోలేదట. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ హైదరాబాదుకు రావడం అలా ఇద్దరు కలిసిపోవడం ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించడం జరగడంతో ఈ ఇద్దరు అభిమానులు కూడా ఇక మరెప్పుడు విభేదాలు చూపలేదట. ప్రస్తుతం ఆయన రాసుకున్న ఈ డైరీలోని విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: