ధనుష్ తో సినిమా చేయడానికి చాలా గ్యాప్ వచ్చింది. ఈలోపు ధనుష్ హాలీవుడ్ యాక్టర్, బాలీవుడ్ యాక్టర్ అయిపోయాడు. ఇప్పటికి మేము ఇంకా బ్రదర్స్ లానే బిహేవ్ చేస్తుంటాం.
ధనుష్ గారితో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు, మళ్ళీ పదకొండు సంవత్సరాల తరువాత 'నేనే వస్తున్నా' చిత్రం రాబోతుంది?

ధనుష్ తో సినిమా చేయడానికి చాలా గ్యాప్ వచ్చింది. ఈలోపు ధనుష్ హాలీవుడ్ యాక్టర్, బాలీవుడ్ యాక్టర్ అయిపోయాడు. ఇప్పటికి మేము ఇంకా బ్రదర్స్ లానే బిహేవ్ చేస్తుంటాం.

ధనుష్ గారికి ఈ కథ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?

నేను మాములుగా ధనుష్ కి ఒక ఐడియా మాత్రమే చెప్పాను, మేము ముందు పుదు పెట్టై- 2 చెయ్యాలి అనుకున్నాం. తరువాత మనం వేరే ప్రాజెక్ట్ చెయ్యాలి అనే థాట్ వచ్చింది.ధనుష్ కి ఒక కోరిక ఉండేది ఇద్దరం కలిసి ఒక సినిమా రాయాలని, సో మేము ఫస్ట్ టైం కలిసి రాసాం.

ధనుష్ గారితో రైటర్ గా వర్కింగ్ ఎక్సపీరియన్స్ ఎలా ఉంది?

ధనుష్ చాలామంచి రైటర్, ఆల్రెడీ ధనుష్ వి.ఐ.పి లాంటి సినిమాలు రాశాడు. ధనుష్ వెరీ సెన్సిటివ్ రైటర్, నేను ఇప్పటివరకు ఎవరితో కలిసి రాయలేదు ఫస్ట్ టైం ధనుష్‌తో కలిసి ఈ సినిమాను రాసాను.

సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. యువన్ శంకర్ రాజా గురించి ఏమి చెప్తారు?

యువన్ నాకు మూడో బ్రదర్ లాంటివాడు. ఇరవై రెండు సంవత్సరాలుగా నేను యువన్‌తో వర్క్ చేస్తున్నా. ముగ్గురు బ్రదర్స్ కలిసి మళ్ళీ ఈ సినిమాకు పనిచేశాం.

నటుడిగా మీకు ఇది మూడో చిత్రం. దీనిలో మీ రోల్ ఎలా ఉండబోతుంది?

అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది అండి. ఆ పాత్ర చెయ్యాల్సిన ఆర్టిస్ట్ రాలేదు. సో ప్రొడ్యూసర్, ఇంకా ధనుష్ కూడా చెయ్యమంటే నేను చేసేశా. అది ఒక చిన్న రోల్ అంతే. ధనుష్ కోసం ఈ పాత్రను చేశాను.

ధనుష్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. దాని గురించి చెప్పండి?

ధనుష్ రెండోసారి డ్యూయల్ రోల్ చేస్తున్న సినిమా ఇది. డిఫరెన్స్ ఎక్సపీరియన్స్ ఉంటుంది దీనిలో ఇద్దరిని ఒకేసారి చూడటం. డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఒక కేరక్టర్ నుంచి ఇంకో కేరక్టర్ కి ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారని కూడా ఈ సినిమాలో చూడొచ్చు.

మీవి వందశాతం ఫిలిమ్స్ అన్ని కంటెంట్ ఓరియెంటెడ్ ఉంటాయి. ఇప్పుడు మీరు కంటెంట్ మూవీని ప్రిఫర్ చేస్తారా లేక కమర్షియల్ మూవీపి ప్రిఫర్ చేస్తారా?

రెండింటిని ప్రిఫర్ చేస్తా. పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో మంచి కంటెంట్ ఉంది. బాగా ఎంటర్‌టైన్ చేశాయి. రాజమౌళి గారు సినిమాను హద్దులు చెరిపేశారు. అందుకే ఇప్పుడు సౌత్ ఇండియన్ మూవీ అనకుండా ఇండియన్ మూవీ అనగలుగుతున్నాం.

ప్రతీ ఫిల్మ్ మేకర్ ఒక సినిమా చెయ్యడానికి ఎక్కడో ఒకదగ్గర ఇన్‌స్పైర్ అవుతారు. అలా ఈ సినిమా చెయ్యడానికి మీకు ఇన్‌స్పిరేషన్ ఏంటి?

నేను ధనుష్ కలిసి సినిమా చెయ్యాలని మా అమ్మ కోరిక. మీరిద్దరు కలిసి సినిమా చెయ్యండి అని మా అమ్మ చెపినప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేశాం.

కలై పులి థాను సర్‌కి ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?

ఆయన బాగా ఎగ్జయిట్ అయ్యారు. ధనుష్ డ్యూయల్ రోల్‌ను ఎలా చూపిస్తాం? అనేది ఆసక్తికరంగా ఉందని ఫీలయ్యారు. ఈ సినిమాలో ధనుష్‌ను చూస్తుంటే ఇద్దరు డిఫరెంట్ పీపుల్‌ను చూసిన ఫీల్ వస్తుంది.

చాలా ఏళ్ల తరువాత గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో ప్రెజెంట్ చేస్తుంది. దాని గురించి మీ మాటల్లో?

గీతా ఆర్ట్స్ మా సినిమాను ప్రెజెంట్ చెయ్యడం మా హానర్. గీతా ఆర్ట్స్ మంచి ప్రొడక్షన్ హౌస్. మంచి క్వాలిటీ ఫిలిమ్స్‌ను అందిస్తుంది. అల్లు అరవింద్ కూడా చెప్పారు మంచి కథ ఉంటే చెప్పండి అని. గీతా ఆర్ట్స్‌తో వర్క్ చెయ్యడం కూడా ఒక హానర్.

మరింత సమాచారం తెలుసుకోండి: